3 September, 2026 | 1:14 PM

బోథ్ మండల కన్వీనర్ నియామకం ఎప్పుడు?

03-09-2026 | 12:36pm

బోథ్: మండలంలో భారతీయ జనతా పార్టీకి(Bharatiya Janata Party) మంచి పట్టు ఉన్న మండలానికి పూర్తి స్థాయిలో పనిచేసే నాయకత్వం లేకపోవడంతో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ప్రస్తుతం సోనాల మండల కేంద్రానికి చెందిన బోరే రవీందర్ కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే సోనాల నూతన మండలంగా ఏర్పడడంతో సోనాల మండల కేంద్రానికి చెందిన రవీందర్ ను సొనాలా కన్వీనర్ గా నియమించి బోథ్ మండలానికి మండలానికి నూతన కన్వీనర్ నియమించేందుకు గతంలో పార్టీ వర్గాలు ఆలోచించాయి.

అయితే ఇప్పటివరకు కన్వీనర్ రెండు మండలాలకు కలిపి ఒకరే ఉండడంతో ఆశించిన స్థాయిలో పార్టీ కార్యకలాపాలు నిర్వహించడం కష్టంగా ఉందని కార్యకర్తలు(Bharatiya Janata Party workers) వాపోతున్నారు. కార్యకర్తలను వెన్నంటి ఉండే మండల కన్వీనర్ నియామకం జరపాల్సిన అవసరం ఉందని కార్యకర్తలు అంటున్నారు. గతంలో మండల కన్వీనర్ ఎంపికపై కార్యకర్తలతో సమావేశమై సంతకాల సేకరణ సైతం జరిగింది. అయితే కన్వీనర్ నియామకం నిలిచిపోవడంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు.