కాంగ్రెస్, బీజేపీలకు తగిన బుద్ధి చెప్పాలి
ఆరు గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ మోసం
గాలి అనిల్ కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హారీశ్‌రావు
జహీరాబాద్, మే 9 : పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు తగిన బుద్ధి చెప్పా లని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీ రు హారీశ్‌రావు అన్నారు. గురువారం జహీరాబాద్‌లో గాలి అనిల్‌కుమార్‌కు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఆనంతరం కుమార్ హోటల్ వద్ద కార్నర్ మీటింగ్‌లో ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.
మోదీ దేవుడి పేరు తో మత రాజకీయాలు చేస్తూ ఓట్లు దండుకునేందుకు ప్రయత్నిస్తురని విమర్శించారు. జహీరాబాద్ ప్రాంత అభివృద్ధికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ. 150 కోట్ల నిధులు ఖర్చు పెట్టిందని తెలిపారు. రాహుల్ గాంధీ కొత్త హామీలు ఇచ్చే ముందు పాత హామీలు నేరవేర్చనందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి అనిల్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎ మ్మెల్యే కొనింటి మానిక్‌రావు, డీసీఎంఎస్ ఛై ర్మన్ శివకుమార్, పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయ కర్త దేవిప్రసాద్, ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ నరోత్తం, ఎంపీ అభ్య ర్థి గాలి అనిల్ కుమార్, పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యర్తలు పాల్గొన్నారు.






