26 April, 2026 | 11:26 AM

జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో పోలీసుల నాకాబందీ: ఎస్పీ రోహిత్ రాజ్

26-04-2026 10:00 AM

* అసాంఘిక కార్యకలాపాలకు తావు ఇవ్వం

కొత్తగూడెం,(విజయక్రాంతి): జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా, అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏకకాలంలో నాకాబంది కార్యక్రమాన్ని పోలీసులు చేపట్టారు. ఈ నాకాబందీ  ద్వారా ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు ఎస్పీ రోహిత్ రాజు వెల్లడించారు. జిల్లాలో ఎలాంటి, అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా ప్రతిష్టమైన ప్రణాళికతో వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు, పాత నేరస్తులను కనుగొనడానికి ఫింగర్ ప్రింట్, డివైస్ ద్వారా తనిఖీలు చేపట్టడం జరిగిందని తెలియజేశారు.

గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టడం, రోడ్డు ప్రమాదాలను నివారించడంలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను చేపట్టడం, తనిఖీలు చేయడం జరిగిందని అన్నారు. జిల్లాలోని ఐదు సబ్ డివిజన్ల డిఎస్పీల ఆధ్వర్యంలో, ప్రధాన కూడళ్లతో పాటు గ్రామాలలో కూడా ఈ నాకాబందీని నిర్వహించినట్లు వెల్లడించారు. ఇట్టి తనిఖీలలో పట్టుబడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.  ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసువారికి సమాచారం అందించాలని ఈ సందర్భంగా  కోరారు.