గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం
10-05-2024 02:56 AM
మంత్రి సీతక్క
కొమురంభీం ఆసిఫాబాద్, మే 9 (విజయక్రాంతి): గ్రామాల అభివృద్ధి కాంగ్రె స్‌తోనే సాధ్యమని మంత్రి సీతక్క అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కాగజ్‌నగర్ మండలంలోని కోసిని గ్రామం లో ఉపాధి హామీ కూలీలను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించాలని విజ్ఞ ప్తి చేశారు. పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం తీసుకొచ్చిన విషయం గుర్తు చేశారు. ప్రచారంలో సిర్పూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ రావి శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






