రూ.50 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా చెర వీడింది
ప్రభుత్వ భూములు జోలికి వస్తే కఠిన చెర్యలు తప్పవు తహసీల్దార్ సుచరిత
ప్రభుత్వ భూములను పరిరక్షించడంలో కీలక పాత్ర పోషించిన తహాశీల్దార్ సుచరితను అభినందిస్తున్న మండల ప్రజలు
శామీర్ పేట్,(విజయక్రాంతి): ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ భూములు చెర వీడుతున్నాయి. కబ్జాకు గురైన భూములను శామీర్ పేట్ తహసీల్దార్ సుచరిత గుర్తించి స్వాధీనపరుచుకున్నారు. ప్రభుత్వ భూముల చుట్టు కంచె (ఫెన్సింగ్) ఏర్పాటు చేసి ప్రభుత్వ బోర్డులను పాతించారు. వివరాల్లోకి వెళితే శామీర్పేట మండలం బొమ్మరాశిపేట రెవెన్యూకు చెందిన భూములు సర్వే నెంబర్ 416/2 లో 10 ఎకరాల 12 గుంటలు, 417/2 లో 3 ఎకరాల 13 గుంటలు, 429/2లో 3 ఎకరాల 36 గుంటలు మొత్తం 17 ఎకరాల 22 గుంటల్లో కొందరు కబ్జాకు పాల్పడి నీటి సంపులు ఏర్పాటు చేసి కమర్షియల్ గా వాడుకుంటున్నట్లు రెవెన్యూ అధికారుల దృష్టికి వచ్చింది.
దీంతో తహాశీల్దార్ సుచరిత అక్కడకు వెళ్లి పరిశీలించారు. వెంటనే రెవెన్యూ అధికారులతో సర్వే చేయించి ప్రభుత్వ భూములను గుర్తించి ఫెన్సింగ్ వేసి హద్దులను ఏర్పాటు చేశారు. ఈ భూముల విలువ సుమారు రూ.50 కోట్ల వరకు పలుకుతుంది. ఇట్టి భూములను భవిష్యత్తులో ప్రజా ప్రయోజనాల కొరకు వాడుకునే విదంగా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ప్రభుత్వ భూములను గుర్తించి స్వాధీనం చేసుకున్నందుకు తహాశీల్దార్ సుచరితను అభినందిస్తు మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆస్ఐ రాఘవ, జి.పిఒ అంజనేయులు ఉన్నారు.
ప్రభుత్వ భూములను కబ్జాకు పాల్పడితే ఉపేక్షించేది లేదు: శామీర్పేట తహాశీల్దార్ సుచరిత
శామీర్ పేట్ మండల రెవెన్యూలో ప్రభుత్వ భూములను ఎవరైనా కబ్జాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని తహాశీల్దార్ సుచరిత అన్నారు. ప్రభుత భూముల పరిరక్షణకు తగు చర్యలు తీసుకుంటారని చెప్పారు. ప్రభుత్వ భూములను గుర్తించి హద్దులు ఏర్పాటు చేసి వెంటనే రక్షణ చర్యలు చేపడుతామని పేర్కొన్నారు. ఇంకా శామీర్పేటలో ప్రభుత్వ భూములను గుర్తించి ఆ భూములను స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. అట్టి భూములను కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.






