14-02-2026 01:30:14 AM
మొత్తం పది వార్డుల్లో 9 స్థానాల్లో పోటీ చేసి 8 స్థానాలు సింహం గుర్తు కైవసం
సింగిల్ వార్డుకు పరిమితమైన కాంగ్రెస్,బీఆర్‌ఎస్
ౠ ౠసత్తా చాటిన వడ్డేపల్లి శ్రీనివాసులు వర్గం
అలంపూర్, ఫిబ్రవరి 13: జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బిజెపి పార్టీలు సింహం విసిరిన పంజాకు కుదేలయ్యాయి. పుర సమరంలో ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ ( ఏఐఎఫ్ బి ) పార్టీకి చెందిన సింహం గుర్తు అభ్యర్థులు విజయ దుందుభి మోగించారు. మునిసిపాలిటీలో మొత్తం 10 వార్డుల్లో 9 స్థానాల్లో పోటీ చేసి 8 స్థానాలు సింహం గుర్తు కైవసం చేసుకోగా, కాంగ్రెస్ ,బీఆర్‌ఎస్ ఒక్కో స్థానానికి పరిమితం అయ్యారు. 8 చోట్ల సింహం గుర్తు పై విజయం సాధించిన అభ్యర్థులే గెలవడంతో వడ్డేపల్లి మున్సిపాలిటీ ఆ పార్టీ ఏకపక్షంగా కైవసం చేసుకుంది.ఈ విజయం సందర్భంగా కార్యకర్తలు సింహం గుర్తు జెండాలతో భారీ ర్యాలీ నిర్వహిస్తూ సంబరాలు జరుపుకున్నారు.
‘9వ వార్డులో స్వల్ప మెజార్టీతో విజయం
లెక్కింపు ప్రక్రియలో భాగంగా 9 వార్డులో ఏఐఎఫ్ బి సింహం గుర్తు మీద బరిలో నిలిచిన నాయకి అజయ్ ,బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన పోలకల్ సూరి మధ్య 13 ఓట్ల స్వల్ప మెజారిటీతో బిఆర్‌ఎస్ అభ్యర్థి పోలకల్ సూరి విజయం సాధించారు.
వార్డుల వారీగా విజేతలు..
1 వార్డు పావని ..(ఏఐఎఫ్ బి)
2 వార్డు సారంద ..(ఏఐఎఫ్ బి)
3 వార్డు వెంకట్రామన్..( కాంగ్రెస్)
4 వార్డు మంజుల .. (ఏఐఎఫ్ బి)
5 వార్డు యుగంధర్ రెడ్డి.. (ఏఐఎఫ్ బి)
6 వార్డు దేవమ్మ ..(ఏఐఎఫ్ బి)
7 వార్డు విజయ్ భాస్కర్..(ఏఐఎఫ్ బి)
8 వార్డు నంబి జయశ్రీ ..(ఏఐఎఫ్ బి)
9 వార్డు పోలుకల్ సూరి ( బీఆర్ ఎస్ )
10 వార్డు తిమ్మప్ప .. (ఏఐఎఫ్ బి) విజేతలుగా అధికారులు ప్రకటించారు.