సర్ ఫేజ్-2లో మరింత అప్రమత్తంగా ఉండాలి
- అర్హుల ఓటు ఒక్కటి కూడా పోకుండా చూడాలి
- నోటీసులొస్తే తగిన ధృవీకరణ పత్రం అందించి ఓటు రక్షించుకోవాలి
- బీఎల్ఏ-2లు, కోఆర్డినేషన్ కమిటీ, పార్టీ శ్రేణులు అందుకు సమాయత్తం కావాలి
- వచ్చే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం
- సమీక్షా సమావేశంలో ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి పిలుపు
ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఎస్ఐఆర్ ఫేజ్-2లో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి శ్రేణులకు సూచించారు. సోమవారం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ఎస్ఐఆర్ తదుపరి ప్రక్రియపై జరిగిన సమీక్షా సమావేశానికి హాజరై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎస్ఐఆర్ తో నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో 39 వేల ఓట్లు పర్మినెంట్ షిప్టింగ్, డెత్, గైర్హాజరు వలన నమోదు కాలేదన్నారు. పర్మినెంట్ షిప్టింగ్ 18 వేలు, మృతి చెందిన వారు 5,838, గైర్హాజరు 10,966, ఎన్ రోల్ మెంట్ పూర్తయినవి 4 వేలు ఇలా మొత్తం 2,50,393 ఓట్లలో 39,664 ఓట్లు తొలగించే ప్రమాదం ఉందన్నారు.
ఎస్ఐఆర్ ఫేజ్ -2లో బీఎల్ఏ-2లు ఎస్ఐఆర్ కోఆర్డినేషన్ కమిటీ ఒక్క అర్హుడి ఓటు కూడా పోకుండా చూడాలని, మ్యాపింగ్ కానివారికి నోటీసులొస్తే ఎన్నికల కమీషన్ సూచించ మేరకు 12 ధృవీకరణ పత్రాలలోఏదో ఒకటి సమర్పించి ఓటు పోకుండా కాపాడేలా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. మ్యాపింగ్ కాని ఓట్లను రక్షించుకోవాలని సూచించారు. పేదల ఓట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మనమీదే ఉందన్నారు. ఫేజ్ వన్ లో ఎలా చురుకుగా పనిచేసామో ఫేజ్ టూలో కూడా అంతే చురుకుగా పని చేయాలని సూచించారు. నోటీసులొచ్చిన వారి వివరాలు సేకరించి వారి ఓటు పోకుండా జాగ్రత్త పడాలన్నారు.
అవసరమైతే కోర్టు ద్వారా పోరాడి అయినా సరే ఓటును కాపాడుకోవాలని సూచించారు. ఆదిలాబాద్ గడ్డమీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని రాష్ట్ర హైకమాండ్ మనమీద ఒక బాధ్యత పెట్టిందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి అన్నారు. దానిని మనమంతా సవాల్ గా తీసుకుని గెలిచేలా ప్రతీ ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ సీటుతో పాటు పార్లమెంట్ పరిధిలోని ఏడుకు ఏడు అసెంబ్లీ స్థానాలలో గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేసారు.
ఆదిలాబాద్ అసెంబ్లీ సీటు గెలిచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానుకగా సమర్పిద్దామన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఎన్ని మాయ మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టినా కాంగ్రెస్ పార్టీ విజయాన్ని మాత్రం అడ్డుకోలేరన్నారు. ఏ పాయల్ శంకర్ కోవర్టు మనల్ని ఏమీ చేయలేరన్నారు. పార్టీ కోసం ఆదిలాబాద్ ప్రజల కోసం తాను పోరాడుతూనే ఉంటానన్నారు. మీ శక్తితోనే తాను ముందుకు నడుప్తున్నట్టు తెలిపారు. కొత్త పాత కార్యకర్తలకు ఏకష్టం వచ్చినా తాను కాపాడుకుంటానని అన్నారు.విజయం కోసం అంతా కలిసి కట్టుగా పని చేద్దామన్నారు. రాష్ట్రంలో మరోమారు పార్టీ అధికారంలోకి రావాలని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు.
అలాగే దేశంలో పార్టీ అధికారం చేపట్టి ప్రధాని గా రాహుల్ గాంధీ అవుతారని ఆశాభావం వ్యక్తం చేసారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూకబ్జాలకు చరమగీతం పాడుదామని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి పేర్కొన్నారు. ప్రభుత్వ అసైండ్ భూమిని పాయల్ శంకర్ తన భార్యకు బహుమతిగా ఇచ్చారన్నారు. పాయల్ అక్రమాలపై ప్రశ్నించాలన్నారు. భూసేకరణలో కూడా అక్రమాలకు పాల్పిడితే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఎక్కడికక్కడ అడ్డుకుంటారన్నారు. బీజేపీ కార్యకర్తలే పాయల్ శంకర్ అవినీతి చిట్టాను తమ కందిస్తున్నారని అన్నారు.
ఎన్ని కష్టనష్టాలకోర్చయినా తాను ప్రజల తరపున కార్యకర్తల తరపున ఉంటానన్నారు. ఎమ్మెల్యే తాటాకు చప్పుళ్ళకు తాను భయపడనని అక్రమాలపై నిరంతరం పోరాడుతూనే ఉంటానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను శ్రేణులు ఇంటింటికి ప్రచారం చేయాలన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ లో పార్టీ శ్రేణులు పాల్గొనాలన్నారు.సోషల్ మీడియాలో కూడా విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు. బూత్ స్థాయి నుండి పార్టీ బలోపేతం చేసుకుని ఆదిలాబాద్ లో కాంగ్రెస్ పార్టీని ఒక అజేయ శక్తి గా నిలుపుదామన్నారు. అంతా కలిసికట్టుగా పార్టీ కోసం కష్టపడదామని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆత్మకమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్ రావు, నాయకులు బండారి సతీష్ , ఇజ్జగిరి సంజయ్, ఖిజర్ పాషా, సుధాకర్ రెడ్డి లోక ప్రవీణ్ రెడ్డి, కొండ గంగాధర్ , మునిగెల నర్సింగ్ , మునిగెల విటల్, గుడిపల్లి నగేష్,శాంతన్ రావు,భోజారెడ్డి దాసరి ఆశన్న, షాహిద్ ఆలీ, మహబూబ్ , చరణ్ గౌడ్, రాందాస్ నాక్లే , బిక్కి గంగాధర్, అశోక్ ఠాక్రె, సుదర్శన్ అల్చెట్టి నాగన్న, కోలా నర్సింలు,సుఖేందర్ , అన్నపూర్ణ ,స్వాతి కాంబ్లే, మంచికట్ల ఆశమ్మ, శ్రీలేఖ,కావేటి జ్యోతి,సోనియా జుబేదా, రఫీఖ్, ఎంఏ షకీల్ ,వెంకట్ యాదవ్, బత్తుల శ్రీనివాస్, బాపూరావు,ఆత్రం నగేష్, కమలాబాయి, నితిన్ బోయర్,వేణుగోపాల రెడ్డి,వామన్,నిమ్మల గౌతం రెడ్డి ,ఆతిఖ్ , శ్యామ్ రావు తదితరులు పాల్గొన్నారు.






