02-02-2026 04:29:09 PM
216 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు
60 మందికి 36 మందిని ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన డిసిసి జిల్లా అధ్యక్షులు సంజీవ ముదిరాజ్
మహబూబ్ నగర్(విజయక్రాంతి): మహబూబ్ నగర్ కార్పొరేటర్ అభ్యర్థుల ఖరారు అప్పుడు ఇప్పుడు అంటూ కాలయాపనకు ముగింపు పడింది. 216 మంది కాంగ్రెస్ అభ్యర్థులు టికెట్లు ఆశించినప్పటికీ 60 మందిని ఖరారు చేయవలసి ఉండగా మొదటి విడతగా 36 మందిని ఖరారు చేస్తూ డిసిసి జిల్లా అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ జాబితాను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఫోన్ ద్వారా సంజీవ్ ముదిరాజ్ విజయ క్రాంతి దినపత్రిక ప్రతినిధితో మాట్లాడారు పార్టీ గెలుపు కోసం సాహసక్తులుగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. పార్టీ నిర్ణయాన్ని అందరూ స్వాగతించి కట్టుబడి పనిచేయాలని సూచించారు. టికెట్లు రానివారు ఎవరు అసంతృప్తి చెందకూడదని మునుముందు వారికి సమచిత స్థానం లభిస్తుందని తెలిపారు. సర్వేలతోపాటు అన్ని వివరాలను తీసుకుని టికెట్లు ఖరారు చేయడం జరిగిందని పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

