17 April, 2026 | 3:19 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆర్థిక సాంకేతిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమం

02-02-2026 04:54 PM

మఠంపల్లి: మఠంపల్లి మండలంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు పెదవీడు శాఖ ఆధ్వర్యంలో మట్టపల్లి గ్రామపంచాయతీ వద్ద ఆర్థిక సాంకేతిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమం బ్యాంకు మేనేజర్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ రామిశెట్టి విజయశాంతి అప్పారావు సమక్షంలో మహిళా సంఘాలు రైతులు ప్రజలు ఉద్దేశించి బ్యాంకు మేనేజర్ బి.మహేష్ మాట్లాడుతూ... ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా, ప్రధానమంత్రి సురక్ష భీమా, ఎస్బిఐ జనరల్ ఇన్సూరెన్స్, పిఎమ్ ఆటల్ పింఛన్ వీటితో పాటు సైబర్ నేరాల్లో ప్రజలందరూ అప్రమత్తమై ఉండాలి. ఒకవేళ మన ఖాతాలో డబ్బులు పోతే 1930 కు గంట లోపల ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని, పోయిన డబ్బులు సైబర్ నేరాల్లో పోయిన తిరిగి రప్పించవచ్చని ప్రజలకు తెలియాజేశారు. ఈ కార్యక్రమంలో   సి ఎస్ పి,వివోఏ మహిళలు తదితరులు పాల్గొన్నారు.