02-02-2026 04:24:15 PM
చేర్యాల: బీజేపీ పార్టీ మాజీ ఎస్సీ మోర్చా గౌరవ అధ్యక్షుడు, భవన నిర్మాణ కార్మిక మండల అధ్యక్షుడు కుర్రారం బాల నర్సయ్య సోమవారం జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరాడు. ఈ సందర్భంగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి జరుగుతుందని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు బాల నరసయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ అద్యక్షుడు మంజె మల్లేశం, పట్టణ అధ్యక్షుడు దాసరి శ్రీకాంత్, యూత్ కాంగ్రెస్ భువనగిరి పార్లమెంట్ మాజీ కార్యదర్శి మారెళ్ళ భాస్కర్ రెడ్డి, ఉడుముల భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కోట వెంకటస్వామి, తాడికొండ సదానందం, ఉపేందర్, పోతురాజు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.