21 March, 2026 | 7:41 PM

జిల్లాలో ఎట్టకేలకు కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు

20-03-2026 12:00 AM

నిర్మల్, మార్చి 19 (విజయక్రాంతి) : నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పూర్తిస్థాయి కమిటీని గురువారం అధికారిక ంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ కుమార్‌గౌడ్ ప్రకటించినట్టు జిల్లా అధ్యక్షులు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బుజ్జి తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడుమ బుజ్జిపటేల్ మూడు నెలల క్రితమే నియమిం చగా జిల్లాస్థాయి పూర్తి కమిటీని ప్రకటించలేదు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జిల్లా స్థాయి పూర్తి కమిటీని ప్రకటించడం పట్ల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్య క్తం చేస్తున్నారు.

ఈ కమిటీలు ఉపాధ్యక్షులుగా ఆరుగురికి, ప్రధాన కార్యదర్శు లుగా ఎనిమిది మందికి, అధికార ప్రతినిధులుగా నలుగురికి, కార్యదర్శులుగా ఐదుగురికి, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా 23 మందికి అవకాశం కల్పించారు, నిర్మల్ ముధోల్ ఖానాపూర్ నియోజకవర్గం లోని అన్ని ప్రాంతాల నేతలను సమన్వయం చేసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా వర్గాలకు ఈ జిల్లా కమిటీలో స్థానం కల్పించినట్టు తెలిపారు. ఈ కమిటీ కాంగ్రెస్ కార్యక్రమా లను ప్రజల్లోకి తీసుకెళ్తుందని పేర్కొన్నారు. త్వరలో జిల్లా కేంద్రంలో కమిటీ బాధ్యతలను చేపట్టనున్నట్టు ఆయన వివరించారు.