బీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఉప సర్పంచ్
ఎమ్మెల్యే సమక్షంలో చేరిక
జహీరాబాద్, ఏప్రిల్ 3 : జహీరాబాద్ మండల పరిధిలోని మధులై తాండకు చెందిన ఉపసర్పంచ్ తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య కార్యకర్తలు బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వీరికి జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు తన క్యాంపు కార్యాలయంలో గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో తాండాలను గ్రామపంచాయతీ గా మార్చి గిరిజనులకు స్వేచ్ఛను అందించారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నోటికి వచ్చినట్లు వాగ్దానాలు ఇచ్చి గదినెక్కిందని, ఇప్పుడు ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేశామని తలలు బాదుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా కాలయాపన చేస్తుందన్నారు. మొదలైతాండకు చెందిన ఉప సర్పంచ్ ప్రేమ్ రాథోడ్, జై సింగ్, రవి, ఏక్నాథ్, సంతోష్, కృష్ణ, జైపాల్, ధనరాజ్, నాగేందర్ రాజు, పృథ్వి, వెంకట్, మనోజ్ లతో కలిసి 40 మంది కార్యకర్తలు చేరారు. కార్యక్రమంలో మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు తట్టు నారాయణ, ఎస్టీ సెల్ అధ్యక్షుడు హీరో రాథోడ్, మండల బీసీ సెల్ అధ్యక్షుడు అమిత్ కుమార్, మైనార్టీ అధ్యక్షుడు వహీద్ అలీ, నాయకులు చిన్నారెడ్డి, జగదీష్, పర్వేజ్ పటేల్, రాజు, గులాబ్ సింగ్ పవర్, దేవిదాస్ పవర్ రాథోడ్, మేఘనాథ్ తదితరులు పాల్గొన్నారు.




