4 April, 2026 | 3:57 AM

కార్యకర్తలే బీఆర్‌ఎస్‌కు వెన్నుదన్ను

04-04-2026 02:14 AM

కార్యకర్తల సమావేశంలో..

మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి 

రామాయంపేట, ఏప్రిల్ 3 :బి ఆర్ ఎస్ పార్టీకి మీ అవసరం ఎంతో ఉన్నది. మీరే వెన్నుదన్ను. నేటి కార్యకర్తలే రేపటి లీడర్లు అంటూ మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి ఉద్భోదించారు. పదవులు ఉన్నా.. లేకున్నా తమ లక్ష్యం ఒక్కటే అని తేల్చి చెప్పారు. కొన్నాళ్లుగా బి.ఆర్.ఎస్ లో నూతన ఉత్సాహం వెళ్లి విరిసిందన్నారు. రామాయంపేట పట్టణ యూత్ అధ్యక్షులుగా రొయ్యల రామయంపేట పట్టణ బి ఆర్ ఎస్ యూత్ అధ్యక్షుల రొయ్యల నియమితుల య్యారు. శుక్రవారం నూతన కార్యవర్గాన్ని పద్మా దేవేందర్ రెడ్డి నియమించారు.

అధ్యక్షుడిగా రొయ్యల నవీన్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా రాచూరి శ్రీనివాస్, కన్వీనర్ గా దాకి పునీత్, కోశాధికారిగా కన్నాపురం సందీప్ గౌడ్, ఉపాధ్యక్షుడిగా ఎరుపల పవన్,పుట్టి శేఖర్ నెక్కొండ వంశీ, దేవుని మహేష్, సంయుక్త కార్యదర్శి గా మెట్టు గణేష్, దోమకొండ బాణం, డి ప్రకాష్ ,బానోత్, మంగయ్య, కార్యదర్శిగా గండేపు చందు, ఎం నరేష్, రొయ్యల శివ, రొయ్యల శివ, పి.సంజయ్ మధు,పల్లె రాజు, దోమకొండ ప్రశాంత్, సలహాదారులుగా బొట్టు సామెల్, ఊర నరేష్, బత్తుల వంశీ ,యాదగిరి, సభ్యులుగా వర్కు శ్రీధర్, నరేష్, భాస్కర్, చందు, సాధువుల శేఖర్, సార్గు స్వామి, శంకర్, జాల్ల శంకర్, అంబటి సాయిలు ఉన్నారు.