4 April, 2026 | 3:57 AM

పంచముఖ హనుమాన్ విగ్రహానికి భారీ విరాళం

04-04-2026 02:11 AM

రూ.50వేలు అందించిన నీలం మధు ముదిరాజ్ 

జిన్నారం/ అమీన్ పూర్, ఏప్రిల్ 3: గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని మాదారం గ్రామంలో 42 అడుగుల శ్రీ పంచముఖ హనుమాన్ విగ్రహం వద్ద నీలం మధు ముదిరాజ్ పూజలు నిర్వహించి కమిటీ సభ్యులకు రూ.50,000 అందజేశారు. ఇంత చక్కటి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు కమిటీ సభ్యులకు, గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఎల్.మహేందర్ గౌడ్, కౌన్సిలర్ జలగిరి మల్లేష్ ముదిరాజ్, ఎరుకల నవీన్ కుమార్, జిన్నారం మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కలల్ రాజు గౌడ్, ఠాగూర్ సీతారాం సింగ్, పెండలం మల్లేష్ ముదిరాజ్, తోట్ల రామకృష్ణ ముదిరాజ్, తోట నరసింహులు ముదిరాజ్, విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు ఎస్ విజయ్ గౌడ్, సుదర్శన్, సిహెచ్ గణేష్, చెరుకుల మల్లేష్, దాసరి సాయి, పెరుగు సీతారాం, చెరుకుల లక్ష్మణ్, మనోజ్, మహేష్, వెంకటేశం గౌడ్, ఎరుకల రవి తదితరులు పాల్గొన్నారు.