calender_icon.png 4 August, 2025 | 9:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ జెండా ఎగర వేయాలి

01-08-2025 12:56:48 AM

ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర ఇంచార్జ్ సుభాశ్ 

కుమ్రంభీం ఆసిఫాబాద్ జూలై 31 (విజ యక్రాంతి): స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర ఇం చార్జ్ సుభాశ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాల యం ఆవరణలో డిసిసి అధ్యక్షుడు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు అధ్యక్షతన జరిగిన రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ కార్యక్రమానికి ఎమ్మెల్సీ దండేవిఠల్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జెడ్పి మాజీ చైర్మన్ గణపతి తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ కోసం పని చేసే వారికి తగిన గుర్తింపు లభిస్తుందని తెలిపారు. వార్డు, గ్రామ స్దాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు  కార్యకర్తలు నడుం బిగిం చాలని కోరారు. పార్టీ కోసం పని చేసే కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఎమ్మెల్సీ విఠల్ మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడాని కి కార్యకర్తలు కృషి చేయాలన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో యువతకు 20 శాతం టికె ట్లు ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో  మాజీ ఎంపీపీలు బాలేశ్ గౌ డ్, నాయకులు రామయ్య, నాయకులు ప్రకా ష్ రావు, రమేశ్, చరణ్, వసంత్‌రావు, మహే ష్‌గౌడ్, మునీర్ అహ్మద్ గోపాల్ నాయక్ , శివ,  కార్తీక్, తదితరులు పాల్గొన్నారు.