calender_icon.png 4 August, 2025 | 12:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సార్ల కోసం రోడ్ ఎక్కిన తల్లిదండ్రులు

01-08-2025 12:55:28 AM

నిర్మల్, జూలై 31 (విజయక్రాంతి): కుంటాల మండలంలోని కల్లూరు ప్రభుత్వ పాఠ శాలలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులను ఇతర పాఠశాలకు డిప్యూటే షన్‌పై పంపడాన్ని నిరసిస్తూ తల్లిదండ్రులు గురువారం ఆందోళన నిర్వహించారు.

పాఠశాలలో పిల్లలు ఎక్కువగా ఉన్నప్పటికీ విద్యా శాఖ అధికారులు  ఉపాధ్యాయులను ఇతర పాఠశాలలకు కేటాయించినట్టు తెలుసుకున్న పేరెంట్స్ పాఠశాలకు వెళ్లి పాఠశాల ఇబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు బడికి తాళం వేసి ర్యాలీగా వచ్చి బైంసా నిర్మల్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించాలని లేకుంటే పాఠశాలకు తమ పిల్లలను పంపబోమని హెచ్చరించారు. ఎంఈఓ అక్క డ చేరుకొని జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వగా డిప్యూటేషన్ రద్దు చేస్తామని అధికారులు ప్రకటించడంతో తల్లిదండ్రులు ఆందో ళన విరమించారు