12 April, 2026 | 2:46 AM

కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదు!

12-04-2026 01:06 AM
  1. అందుకే మహిళా కోటా బిల్లును అడ్డుకునే యత్నం
  2. సీఎం రేవంత్ కావాలనే దక్షిణ, ఉత్తర భారతం అంటున్నారు
  3. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శ 

హైదరాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి):  దేశంలో కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదని, అందుకే మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవాలని  ఆ పార్టీ చూస్తున్నదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. 1996 నుంచి 2010 వరకు అనేకసార్లు ఈ బిల్లు ను ప్రవేశపెట్టే ప్రయత్నాలు జరిగినప్పటికీ, కాంగ్రెస్ తన మిత్రపక్షాలైన సమాజ్‌వాది పార్టీ, ఆర్జేడీ వంటి మిత్రపక్షాల అడ్డంకుల వల్ల బిల్లు ముందుకు సాగలేదని ఆయన చెప్పారు.

50 ఏళ్ల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరుగుతున్నదని.. సీఎం రేవంత్ రెడ్డి కావాలనే దక్షిణ, ఉత్తర భారతదేశం అని చెప్పుకొస్తున్నారని తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం  ఏర్పాటుచేసిన జ్యోతిరా వు ఫూలే జయంతి వేడుకల్లో లక్ష్మణ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ,  ఎస్టీల సంఖ్య అసెంబ్లీ, పార్లమెం ట్‌లో పెరగకూడదని కాంగ్రెస్ అడ్డుకుంటున్నదని విమ ర్శించారు.

50 ఏళ్ల తర్వాత నియోజ కవర్గాల పునర్విభజన జరుగుతున్నదన్నారు. మూడు రోజుల పాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటుచేసి మహిళా బిల్లును పెట్టనున్నట్లు తెలిపారు. జ్యోతిరావు ఫూలే ఆశయాలను ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని చెప్పారు. పార్లమెంటులోనే బిల్లును చింపివేసి మహిళలను అవమానించిన పార్టీలతో కాంగ్రెస్ ఇప్పటికీ కలిసి నడుస్తోందని విమర్శించారు.

మహిళా హక్కుల పట్ల కాంగ్రెస్‌కు ఎప్పుడూ చిత్తశుద్ధి లేదని, కేవలం ఓట్ల రాజకీయమే వారి లక్ష్యంగా మారిందని ఆరోపించారు. గత 11 సంవత్సరాల్లో మోదీ ప్రభుత్వం మ హిళల అభివృద్ధి నుంచి మహిళా నేతృత్వంలోని అభివృద్ధి దిశగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లిందని తెలిపారు. ఈ బిల్లు ద్వారా ఎస్సీ, ఎస్టీ మహిళలకు ప్రత్యేక ప్రాతినిథ్యం లభిస్తుందన్నారు. కేంద్రంలో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ మంత్రులున్నారని చెప్పారు.

మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ, ఫూలే మహిళా సాధికారత కలని నెరవేర్చడం కోసం బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. జోతిరావు ఫూలే కన్న కలల ను ప్రధాని మోదీ నెరవేరుస్తున్నారన్నారు. 200 ఏళ్ల క్రితమే జ్యోతిరావు ఫూలే విద్యతోనే భారతదేశం వికసిస్తుందని చెప్పారన్నారు.