సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పెద్దపీట
- బీఆర్‌ఎస్‌కు దళితులంటే చిన్నచూపు
- స్పీకర్‌ను కించపర్చేలా మాట్లాడటం సరికాదు
- బీసీ రిజర్వేషన్లు పెంచుతాం, ఎస్సీ వర్గీకరణ అమలుచేస్తాం
- పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్
హైదరాబాద్, మార్చి 13 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసిందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ కృషి చేస్తుంటే ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేతలు బలహీనవర్గాలను కించపరుస్తున్నారని మండిపడ్డారు.
గురువారం ఆయన గాంధీభవన్‌లో నూతనంగా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్‌నాయక్‌తో కలిసి మీడియా తో మాట్లాడారు.. 2014లో బీఆర్‌ఎస్ ప్రభు త్వం నిరంకుశంగా వ్యవహారించి అప్పటి కాంగ్రె స్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్ సభ్యత్వం రద్దుచేసిందని, గత అసెం బ్లీలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కకు సీఎల్పీ నేతగా అవకాశం ఇస్తే ప్రతిపక్ష హోదా లేకుం డా చేశారని మండిపడ్డారు.
ఇప్పుడు అసెంబ్లీ లో దళిత స్పీకర్‌పై ఆ పార్టీ ఎమ్మెల్యే జగదీశ్వర్‌రెడ్డి వ్యవహరించిన తీరు చూస్తుంటే దళితుల విషయంలో బీఆర్‌ఎస్ వ్యవహారిస్తున్న తీరును ప్రజలు గమనించాలన్నారు. ప్రజాస్వామ్యం, రాజకీయ విలువల గురించి కేటీఆర్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. దళితుల ను చిన్నచూపు చూడటం కేసీఆర్ మాదిరిగానే బీఆర్‌ఎస్ నేతలకు అలవాటుగా మారిందని, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ ఆనాడు మోసం చేశాడు..
ఆయన బాటలోనే బీఆర్‌ఎస్ నేతలు నడుస్తున్నారని ఆరోపించారు. కులగణన సర్వే గురించి మాట్లాడే అర్హత కేటీఆర్, హరీశ్‌రావుకు లేదన్నారు. బీసీలకు రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై చట్టసభల్లో తీర్మానం చేయబోతున్నామన్నారు. కుల గణన సర్వేకి భయపడే దాసోజు శ్రవణ్‌కు ఎమ్మెల్సీగా బీఆర్‌ఎస్ అవకాశం ఇచ్చిందన్నారు.






