26 August, 2026 | 6:06 PM

పిచ్చి కుక్కల దాడిలో ముగ్గురికి గాయాలు

26-08-2026 05:16 PM

బెజ్జూర్ ఆగస్టు 26 (విజయ క్రాంతి):  బెజ్జూర్ మండలంలో పిచ్చికుక్కల దాడిలో బుధవారం ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మండల కేంద్రంలో పిచ్చికుక్కల బెడద రోజురోజుకు పెరిగిందని దీనితో రోడ్లపై నడవాలన్న భయం భయంగా ఉందని ప్రజలు తెలుపుతున్నారు. వరుసగా నెల రోజుల్లోనే పదుల సంఖ్యలో పిచ్చికుక్కలు దాడి చేసి గాయపరిచిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని గ్రామ ప్రజలు తెలుపుతున్నారు.

ఇట్టి విషయమై గ్రామపంచాయతీ అధికారులు దృష్టి పెట్టి పిచ్చికుక్కల బెడద నుండి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. రాత్రనక పగలనక పిచ్చి కుక్కలు రహదారులపై గుంపులు గుంపులుగా స్వైర విహారం చేస్తున్నాయని ప్రజలు తెలుపుతున్నారు. రాత్రి సమయంలో ఇంట్లో నుండి బయటకు వెళ్లాలన్న భయం భయంగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇట్టి విషయమై గ్రామ సర్పంచ్ దుర్గం సరోజ తిరుపతిని వివరణ కోరగా పిచ్చికుక్కలు ప్రజలపై దాడి చేసిన ఘటన దృష్టికి వచ్చిందని పిచ్చికుక్కల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.