పక్వానికి రాని పంటను హార్వెస్టర్లు కోయరాదు
కామారెడ్డి, మార్చి 13,(విజయక్రాంతి): జిల్లాలో రబీ వరి పంట కోతలు ప్రారంభం అవుతున్నందున వరి కొనుగోలు కేంద్రాలలో నాణ్యత ప్రమాణాలు వచ్చే విధంగా పౌరసరఫరాల శాఖ కమిషన్ ,జిల్లా కలెక్టర్ల ఆదేశానుసారం గురువారం హార్వెస్టర్ల యజమానులు, డ్రైవర్ల తో సమావేశం ఏర్పాటుచేశారు. హార్వెస్టర్లు పక్వానికి రాణి పంటను కోయరాదని బ్లోయర్ 18-22 Rpm లు ఉంచాలని, గేర్ స్పాట్ A to B లో ఉంచాలని వివరించారు. జిల్లాలో వరి కోత షెడ్యూల్ ప్రకారం హార్వెస్టర్ యజమానులు, డ్రైవర్లు వారి యంత్రాలను నిర్దేశించిన ప్రాంతంలో ఉపయోగించాలని సూచించారు.ఈ విషయాలు పాటించని హార్వెస్టర్ యజమానులు, డ్రైవర్ల పై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంకి జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్ విక్టర్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, ఆర్టిఏ శ్రీనివాస్ రెడ్డి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.






