30 June, 2026 | 11:54 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

కాంగ్రెస్ అంటేనే రైతు పక్షపాత పార్టీ..

24-06-2025 07:46 PM

జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్

ఖమ్మం (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు పక్షపాత పార్టీ అని, నేడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలు ఆదర్శనీయమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్(District Congress Committee President Puvvala Durga Prasad) స్పష్టం చేశారు. రైతు భరోసా నిధుల విడుదలకు కృతజ్ఞతగా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజి శాసనమండలి సభ్యులు పోట్ల నాగేశ్వరరావు, జిల్లా రైతు కన్వీనర్ నల్లమల వేంకటేశ్వరరావు, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అద్యక్షులు మొక్కా శేఖర్ గౌడ్, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ యరగర్ల హనుమంతరావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా, నగర  కాంగ్రెస్ అనుబంధ సంఘ అద్యక్షులు, కార్పొరేటర్లు, డివిజన్ అద్యక్షులు శ్రేణులతో కలిసి పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వీరితో పాటు జిల్లా ఐయన్టియుసి, మహిళా కాంగ్రెస్, సేవాదళ్, మైనారిటీ, ఎస్ సి సెల్ అధ్యక్షులు కొత్తా సీతారాములు, దొబ్బల సౌజన్య, సయ్యద్ గౌస్, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, బొడ్డు బొందయ్య, రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి జెర్రిపోతుల అంజనీ కుమార్, జిల్లా ఆర్ టి ఏ మెంబర్ గజ్జెల్లి వెంకన్న, జిల్లా కాంగ్రెస్ నాయకులు మద్దినేని రమేష్, కోటేరు నర్సిరెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ దిరిశాల చిన్న వేంకటేశ్వరరావు, మాజి యంపిటిసి నల్లమోతు లక్ష్మయ్య,నగర ఓబీసీ సెల్, ఐ యన్ టి యు సి, ఎస్ టి, మైనారిటీ అద్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్, దేవత్, శంకర్ నాయక్, షేక్ అబ్బాస్ భేగ్,కార్పొరేటర్లు లకావత్ సైదులు నాయక్, పి ఏ సి ఎస్ చైర్మన్ రావూరి సైదుబాబు,చామకూరి వెంకటనారాయణ,దుద్దుకూరి వేంకటేశ్వరరావు, మందడపు లక్ష్మి మనోహర్, కమతం రామకృష్ణ, కన్నం ప్రసన్నకృష్ణ, తాతా రఘురాం తదితరులు పాల్గొన్నారు.