30 June, 2026 | 10:55 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

రైతుల పెట్టుబడికి రైతు భరోసా నిధులు

24-06-2025 07:51 PM

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్..

నిర్మల్ (విజయక్రాంతి): మంగళవారం సాయంత్రం రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో జరిగిన రైతు భరోసా సంబరాల్లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రైతులతో మాట్లాడారు. హైదరాబాదులోని రైతు నేస్తం వేదిక నుంచి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. నిర్మల్ గ్రామీణ మండలంలోని న్యూ పోచంపాడ్ గ్రామ రైతు వేదికలో నిర్వహించిన రైతు భరోసా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగాన్ని రైతులతో కలిసి వీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... రైతు భరోసా పథకం ద్వారా విత్తనాలు, ఎరువులు, యాంత్రికరణ పనుల కోసం అవసరమైన పెట్టుబడి సహాయం అంది రైతులకు మేలు చేకూరుతుందని తెలిపారు. ఇప్పటికే జిల్లాలోని 1 లక్ష 85 వేల 116 మంది రైతుల ఖాతాల్లో 260 కోట్ల 80 లక్షల నిధులు జమ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్, ఉద్యానవన శాఖ అధికారి రమణ, తహసిల్దార్ సంతోష్, ఎంపీడీవో గజానన్, ఇతర అధికారులు, రైతులు పాల్గొన్నారు.