తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ షోకాజ్ నోటీసు
- కులగణన సర్వేను తప్పుపడుతూ చేసిన విమర్శలపై పార్టీ సీరియస్
- ఓ సామాజికవర్గంపై దుర్భాషలాడటంపై వివరణ కోరిన క్రమశిక్షణ కమిటీ
హైదరాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కులగణన సర్వేను తప్పుపడుతూ అభ్యంతరకరమైన భాషతో విమ ర్శలు చేయడంతోపాటు కులగణన నివేదికను చించివేయడంపై వివరణ ఇవ్వా ని మల్లన్నకు జారీ చేసిన షోకాజ్ నోటీసుల్లో పేర్కొంది.
కాంగ్రెస్ ప్రభు త్వం ఓ వైపు శాసనసభ, శాసనమండలిలో కులగణన నివేదిక వివరాలను ప్రవేశపెట్టిన సందర్భంలోనే సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మల్లన్న కులగణనను తప్పుపడుతూ విమర్శలు చేయ డం ప్రజల్లో, బీసీ వర్గాల్లో సర్వేపై అనుమానాలను, అపోహలను పెంచిందని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిం చింది.
మల్లన్న చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయ త్నం చేశా రు. ఈ పరిణామాల మధ్య కులగణనపై మల్లన్న చేసిన వ్యాఖ్యలను పార్టీ సీరియస్‌గా తీసుకుని చర్యలకు ఉపక్రమించింది.
అంతేకాకుం డా కులగణనను ప్రశ్నించడమే కాకుం డా ఇటీవల బీసీ నినాదం తో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ రెడ్డి సామాజిక వర్గంపై, సొంత పార్టీ నాయకులపై విమర్శలు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణించింది.






