మన్నె క్రిశాంక్‌కు హైకోర్టులో ఊరట.. బెయిల్ మంజూరు
06-05-2026 01:45 PM
హైదరాబాద్: బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ కు తెలంగాణ హైకోర్టులో(Telangana High Court) ఊరట లభించింది. కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో క్రిశాంక్ కు( Manne Krishank) హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మన్నె క్రిశాంక్ తో పాటు మరో ఏడు గురికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మన్నె క్రిశాంక్ ప్రస్తుతం సంగారెడ్డి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.






