సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కట్ల రవీందర్
06-05-2026 02:20 PM
చందుర్తి,(విజయక్రాంతి): చందుర్తి నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ కట్ల రవీందర్ బాధ్యతలను చేపట్టారు. గతంలో చందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించిన జి.వెంకటేశ్వర్లు డిఎస్పీగా పదోన్నతి పొంది బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో కె.రవీందర్ చందుర్తి సర్కిల్ కార్యాలయంలో నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.






