18 July, 2026 | 12:35 PM

Breaking News

Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •   వనదుర్గమ్మను దర్శించుకున్న సినీ నటుడు మంచు విష్ణు   •  

కాంగ్రెస్ వద్దు బీఆర్ఎస్ ముద్దు అంటూ పార్టీలోకి చేరికలు

29-09-2024 05:34 PM

బీఆర్ఎస్ లో చేరిన వారికి కండువాలు కప్పిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్

ఆదిలాబాద్, (విజయక్రాంతి): బోథ్ మండలంలోని గుట్టపక్క తాండ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మట్ట చందర్ సింగ్, కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షురాలు మట్ట అనిత బాయి ఆదివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నేరడిగొండలోని ఎమ్మెల్యే నివాసంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ అధ్యక్షురాలు అనిత బాయి మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు సహాయం చేయకుండా ఇష్టారాజ్యంగా మారి ఇబ్బందులు పెడుతున్నారు.  బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణకు శ్రీరామ రక్ష అని, బీఆర్ఎస్ పార్టీలో చేరమని తెలిపారు. ఈ సందర్భంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ... పుట్టిన బిడ్డ తల్లి చేతిలో ఉంటే ఎంత సురక్షితమో సాధించిన తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ తోనే సురక్షితంగా ఉంటుందన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీ గెలుపు చరిత్ర సృష్టిస్తుందన్నారు. ఇందులో మాజీ సర్పంచ్ పవార్ ప్రకాష్ సింగ్, నానక్ సింగ్, బాల్సింగ్ తదితరులు ఉన్నారు.