calender_icon.png 12 October, 2025 | 11:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవాలయ మూసివేతకు నిరసనగా సీఎం దిష్టిబొమ్మ దగ్ధం

12-10-2025 08:19:52 PM

దిష్టిబొమ్మను అడ్డుకోని నిరసనకు దిగిన కాంగ్రెస్ నాయకులు..

కోనరావుపేట (విజయక్రాంతి): వేములవాడ రాజన్న ఆలయాన్ని మూసివేతకు నిరసనగా ఆదివారం మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. వెంటనే అక్కడికి కాంగ్రెస్ నాయకులు చేరుకొని సీఎం దిష్టిబొమ్మను అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువురిని శాంతి పరిచి గొడవలు కాకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు మిర్యాల్కర్ బాలాజీ మాట్లాడుతూ రాజన్న ఆలయాన్ని మాసివేయడం సరి అయిన పద్ధతి కాదు అని భక్తులకు దర్శనం కల్పించాలని లేనియెడల భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పంచే కట్టుకొని వచ్చి  భక్తులకు దర్శనం చేయిస్తాము అని అన్నారు. కాంగ్రెస్ నాయకులు హిందువులను కించపరిచే విధంగా చేస్తున్నారని సీఎం దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం నిర్వహించుతుండగా కాంగ్రెస్ నాయకులు గుండాలుగా ఈ కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నించారు. 

రాజన్న గుడిలో శివయ్య దర్శనం కల్పించాలని కోరుతుంటే కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడం నిజంగానే కాంగ్రెస్ వారి యొక్క నిజస్వరూపాన్ని బయటపెట్టింది. ఈ కాంగ్రెస్ పార్టీ వారు హిందూ దేవత లపైన ఎంతటి కక్ష సాధించారో అర్థం అవుతుంది భక్తులకు దర్శనం కల్పించాలని కోరుతుంటే కాంగ్రెస్  నాయకులు అడ్డుకోవడం నిజంగా  సిగ్గు చేటు  ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేదు కానీ అభివృద్ధి పేరిట ఆలయాన్ని మూసివేస్తా అని అనడం చాలా దుర్మార్గపు చేర్యాల భావిస్తున్నాము. రాజన్నకు కోడెమొక్కుల చెల్లించే వారు భీమన్న ఆలయంలో చెల్లించాలా అంటే ఎవరి మొక్కు వారికి వుంటుంది కానీ ఒకరికి చెల్లించే మొక్కు ఇంకో దేవునికి ఎలా మొక్కు చెల్లిస్తారని అడగటం జరిగింది. ఆలయాన్ని మూసివేయడాన్నీ తీవ్రంగా  ఖండిస్తున్నాం అన్నారు. ప్రభుత్వం భక్తులకు ఇబ్భoది కలుగకుండా చూడవలసినది పోయి ప్రభుత్వంలో ఉండి ప్రతిపక్షాలు లాగా అడ్డుకోవడం సిగ్గు చేటు రాజన్న ఆలయంలో ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుకు కుంది  తెలంగాణలో హిందూ వుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి హిందువులు బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ నెంబర్ గొట్టే రామచంద్రం, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి బైరగోని సురేష్ గౌడ్,ఉప అధ్యక్షులు చింతల పరుశురాం, జింక వెంకటి, కార్యదర్శి వేల్పుల తిరుపతి, పొన్నం మహేష్, పిల్లివెంకటి, ఎల్లపుల శ్రీనివాస్, చక్రాల పరుశురాం, కిట్టస్వామి  పరిసరం, లంబవేణు, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.