calender_icon.png 12 October, 2025 | 11:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్నారుల నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు తప్పనిసరి

12-10-2025 08:15:55 PM

కరస్ గుత్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ జువేరియా..

సబ్ సెంటర్లో  కేంద్రంలో పోలియో చుక్కల పంపిణీ ప్రారంభం..

నాగల్ గిద్ద: చిన్నారుల నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి జూవేరియా అన్నారు. రాష్ట్రంలోకి పోలియో తిరిగి రాకుండా చూసేందుకు అక్టోబర్ 12న మండలంలోని వివిధ అంగన్వాడి కేంద్రంలో పోలియో చుక్కల పంపిణీని ఆదివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి జువేరియా మాట్లాడుతూ పిల్లల బంగారు భవిష్యత్తుకు తల్లిదండ్రులు ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలన్నారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేయిస్తే భవిష్యత్తులో అంగవైకల్యం రాకుండా ఉంటుందన్నారు.

పిల్లలకు పోలియో చుక్కలు వేయించకపోతే వారికి పోలియో వైరస్ సోకే ప్రమాదం ఉంటుందని తెలిపారు. ఈ వైరస్ నాడీ వ్యవస్థ పై దాడి చేస్తుందని, దీనివల్ల శాశ్వత పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఒక్కోసారి ఈ వైరస్ శ్వాసకోశ కండరాలపై ప్రభావం చూపి ప్రాణాపాయానికి కూడా దారి తీయవచ్చని సూచించారు. పోలియో టీకా పిల్లలకు ఒక రక్షణ కవచం లాంటిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆసుపత్రి సూపర్వైజర్ విక్టోరియా రాణి, నర్సింగ్ ఆఫీసర్ సబిత,వైద్య సిబ్బంది రాజశేఖర్ రెడ్డి, రమేష్, సురేఖ, శాంతా, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.