కాంగ్రెస్‌ని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలి
పదవులు రాని వాళ్ళు నిరుత్స పడవద్దు
భవిష్యత్తులో అందరికీ అవకాశం కల్పిస్తాము
టిపిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్
కామారెడ్డి, మే 26 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి కుటుంబానికి చేరేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో క్రిస్టల్ ప్యాలెస్ లో జిల్లా కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పిఎసి సమావేశంలో టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దిశా నిర్దేశం చేశారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు అవకాశాలు లభిస్తాయి అని అన్నారు. అవకాశం రానివారు నిరుద్యోపడాల్సిన అవసరం లేదన్నారు. రాబోయే రోజుల్లో వారికి కూడా తగిన ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు.
ప్రతి కార్యకర్త పార్టీ ఆస్తి అని, అందరిని కలుపుకొని ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు మదన్ మోహన్ రావు, తోట లక్ష్మీ కాంతారావు, టిపిసిసి అధ్యక్షుడు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, డిసిసి అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, మాజీ ఎమ్మెల్యే యూసుఫ్ అలీలు మాట్లాడారు. పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ వ్యక్తిగత భేదాభిప్రాయాలకు అధికంగా ఏకతాటిపైకి వచ్చి ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి సంస్థగతంగా మరింత బలపరచాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులకు నియామక పత్రాలను పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అంద చేశారు. ఈ సందర్భంగా టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పలువురు సన్మానించారు.
ఈ కార్యక్రమంలో డిసిసి మాజీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, సి డి సి చైర్మన్ ఈర్షద్, మాజీ జెడ్పిటిసి తిరుమల గౌడ్, మాజీ ఎంపీపీలు గాల్ రెడ్డి, సుదర్శన్, మార్కెట్ కమిటీ చైర్మన్ లు లక్ష్మి, రాజు, కాంగ్రెస్ నాయకులు గూడెం శ్రీనివాస్ రెడ్డి, రాజా గౌడ్, పల్లె రమేష్ గౌడ్, నౌసి లాల్, పండ్ల రాజు, సుతారి రమేష్, భీమ్ రెడ్డి, యాదవ రెడ్డి, గోనే శ్రీనివాస్, చాట్ల రాజేశ్వర్, చింతల రవీందర్ గౌడ్, కోయల్కర్ కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.






