calender_icon.png 8 February, 2026 | 11:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకు అందుబాటులో ఉంటా

08-02-2026 01:47:16 AM

12వ వార్డు నా కుటుంబం

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఠాగూర్ శివాని లక్ష్మణ్ సింగ్

జిన్నారం/అమీన్‌పూర్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): 12వ వార్డు నా కుటుంబమని, ప్రజలకు ఏ సమస్య వచ్చిన ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని 12వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఠాకూర్ శివాని లక్ష్మణ్ సింగ్ పేర్కొన్నారు. శనివారం మాదారం 12వ వార్డులో ఇంటింటా తిరిగి హస్తం గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా శివాని లక్ష్మణ్ సింగ్ మాట్లాడుతూ వార్డులోని సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తానని తెలిపారు. తన చివరి శ్వాస ఉన్నంత వరకు వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

మా తాత మాజీ సర్పంచ్ ఠాకూర్ మెగా సింగ్, ఆయన ఆకాంక్ష మేరకే తాను రాజకీయాల్లోకి వచ్చానని వివరించారు. మాదారం 100 శాతం డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి దీపాలను ఏర్పాటు చేసి తాగు నీటి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు.అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు ఇప్పిస్తానని, సమస్యల పరిష్కారానికి తోడ్పాటు అందిస్తానన్నారు. కథవ కాలువ నుంచి జీవన్ సింగ్ ఇంటి వరకు సీసీ రోడ్లను వేయిస్తానని వివరించారు. విద్యాభివృద్ధికి కృషి చేస్తా, అంగన్‌వాడీ స్కూల్ ప్రహరీ నిర్మింపజేయనున్నట్లు  హామి ఇచ్చారు. కార్యక్రమంలో సీతారాం సింగ్,మాజీ వార్డు సభ్యులు రాజేందర్ సింగ్, కిషోర్ సింగ్, బజరంగ్ సింగ్, పీటంబర్ సింగ్, కిషన్ సింగ్ పాల్గొన్నారు.