08-02-2026 01:46:52 AM
ఇన్సూరెన్స్ క్లెయిమ్ చెక్కుల అందజేత
హైదరాబాద్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): తెలంగాణ ఆర్టీసీ బస్ భవన్‌లో శని వారం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) ప్రతినిధులు, టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం మధ్య ఒక కీలక సమావేశం జరిగింది. అక్టోబర్ 2021లో కుదుర్చుకున్న ’కార్పొరేట్ శాలరీ టై-అప్’ ఒప్పందం ద్వారా టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు అందుతున్న ప్రయోజనాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ ప్రయోజనాలు ఫిబ్రవరి 1, 2024 నుంచి మరింత మెరుగుపరచబడ్డాయి.
దురదృష్టవశాత్తు మరణించిన టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు దుర్గం రాఘవేందర్‌గౌడ్, అల్లందుర్గ వెంకటేష్ కుటుంబ సభ్యులకు తలా రూ.కోటి విలువైన వ్యక్తిగత ప్రమాద బీమా క్లెయిమ్ చెక్కులను టీఎస్‌ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి, యూనియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమరేష్ ప్రసాద్, చీఫ్ జనరల్ మేనేజర్ ఎం రవీంద్రబాబు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బి.భాస్కర్ (రీజినల్ హెడ్, సికింద్రాబాద్), ఆర్. సత్యనారాయణ (రీజినల్ హెడ్, మహబూబ్ నగర్), టీఎస్‌ఆర్టీసీ ఈడీ (ఆపరేషన్స్), ఈడీ (టెక్నికల్/ఐటీ), ఫైనాన్షియల్ అడ్వైజర్, చీఫ్ పర్సనల్ మేనేజర్ పాల్గొన్నారు