calender_icon.png 3 December, 2025 | 11:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూనెటి కృష్ణతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలి

03-12-2025 10:58:13 PM

కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం..

ముత్తారం (విజయక్రాంతి): ముత్తారం మండల కేంద్రంలో నూనెటి కృష్ణ యాదవ్ తో పాటు మండలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం కోరారు. బుధవారం ముత్తారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముత్తారం గ్రామానికి చెందిన కృష్ణ చేరగా, ఆయనకు మండల పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ తో కలిసి కండువా కప్పి సదానందం ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శ్రీను బాబు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహిళ సోదరులు కార్యకర్తలు అభిమానుల  సహకారంతో  నూనెటి  కృష్ణను ముత్తారం గ్రామ సర్పంచ్ అభ్యర్థి గా ఎంచుకోవడం జరిగిందన్నారు.

ఈ సందర్భంగా నూనేటి కృష్ణ యాదవ్ మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి మీ అందరి సహకారం తో కృషి చేస్తానని అన్నారు. గ్రామ ప్రజలు మంత్రి శ్రీధర్ బాబు, టీసిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు జిల్లా పార్టీకు ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం, మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, మాజీ సర్పంచ్ తూటి రజీతరఫి, కాంగ్రెస్ నాయకుల, కార్యకర్తల సహకారంతో గ్రామ ప్రజల ఆశీస్సులతో సర్పంచ్ గా గెలిచి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.