28 June, 2026 | 1:42 PM

ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి

28-06-2026 01:09 PM

ఘట్‌కేసర్,(విజయక్రాంతి): ఘట్‌కేసర్ మండల పరిధిలోని ఎదులాబాద్, కొర్రెముల, ప్రతాప్ సింగారం, కాచవాని సింగారం, ముత్వల్లిగూడ లకు చెందిన కొన్ని భూములు ల్యాండ్ పూలింగ్ ప్రక్రియలో ఉన్నాయని ఘట్ కేసర్ తహసీల్దార్ చంద్రశేఖర్ తెలిపారు. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియపై ఆసక్తి ఉన్న భూ యజమానులు, రైతులు తమ సమ్మతిని మండల తహసిల్దార్ కార్యాలయంలో తెలియజేయవచ్చని పేర్కొన్నారు. అలాగే  ప్రజల సౌకర్యార్థం ఆయా ప్రాంతాల వార్డు కార్యాలయాలలో కూడా వివరాల నమోదు, అభిప్రాయాల స్వీకరణకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

ప్రతాపసింగారం కి సంబంధించి జూన్ 29, కాచవానిసింగారంకి జూన్ 30, ముత్వల్లిగూడకి జూలై 1, కొర్రెములకి జూలై 2, ఎడులాబాద్ కి జూలై 3 తేదీల్లో వివరాల నమోదు కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రతిరోజు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు నమోదు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. సంబంధిత రైతులు, భూయజమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని నిర్ణీత తేదీల్లో తమ ఆమోదాన్ని నమోదు చేసుకోవాలని తెలిపారు.