calender_icon.png 27 November, 2025 | 8:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ

27-11-2025 12:54:56 AM

-ప్రభుత్వం హడావుడిగా ముందుకు వెళ్ళింది

-మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ 

మహబూబ్ నగర్, నవంబర్ 26 (విజయక్రాంతి): బీసీలకు సముచిత స్థానం కల్పిస్తామని 42 శాతం రిజర్వేషన్ చేస్తామని మాయమాటలు చెప్పి హడావుడిగా ఎన్నికల్లోకి వెళ్లిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అసహనం వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య నేతలతో ఏర్పాటు చేసిన సమావేశం అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో  మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు.

గ్రామాల్లో అందరూ కూర్చొని మాట్లాడుకొని గెలిచే అభ్యర్థులను బరిలో నిలపాలని, పార్టీ కోసం పని చేసే వారు..ఎన్నికలలో పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం పనిచేసిన వారికీ భవిష్యత్ లో గుర్తింపు ఉంటదన్నారు. ఎన్నికల్లో ఎవరు నిర్లక్ష్యం వహించవద్దు. కష్టపడి పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ సమావేశంలో గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్,  మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, మహబూబ్ నగర్ మండల అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, హన్వాడ మాజీ ఎంపీపీ బాలరాజు, సీనియర్ నాయకులు చెన్నయ్య, కొండ లక్ష్మయ్య, జంబూలయ్య, కృష్ణయ్య గౌడ్, రాఘవేందర్ గౌడ్, కృష్ణయ్య,  బసిరెడ్డి, రాజు యాదవ్, వెంకటయ్య, అన్వార్ తదితరులు పాల్గొన్నారు.