calender_icon.png 27 November, 2025 | 9:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి

27-11-2025 12:54:25 AM

తపస్ జిల్లా అధ్యక్షుడు ములుకల్ల తిరుపతి

కాటారం, నవంబర్ 26 (విజయక్రాంతి) :రాష్ట్ర ప్రభుత్వం నివేదికను తెప్పించుకుని పి ఆర్ సి ని వెంటనే ప్రకటించాలనీ, ఉపాధ్యాయ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ జిల్లా అధ్యక్షుడు ములుకల్ల తిరుపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కాటారం డివిజన్ కేంద్రంలో గల వివేకానంద హైస్కూల్ లో జరిగిన కాటారం డివిజన్ తపస్ కార్యనిర్వాక వర్గ సమావేశం లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ములుకల్ల తిరుపతి మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాలగా పి ఆర్ సి నీ ప్రకటించకుండా ప్రభుత్వం వాయిదా వేస్తున్నదని, దీనితో ఉపాధ్యాయులు ఎంతో ఆర్థికంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

వెంటనే ప్రభుత్వం పిఆర్సిపి నివేదికను తెప్పించుకొని 51 శాతం పి.ఆర్.సి ప్రకటిస్తూ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు . అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా ఉపాధ్యాయులకు జిపిఎఫ్, రిటైర్మెంట్ తదితర బిల్లులు చెల్లించకుండా ఉపాధ్యాయులను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బిల్లులన్నింటిని చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాటారం డివిజన్ పరిధిలోని కాటారం మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శిలుగా బూరం స్వరూప, నీల శ్రీకాంత్ , గౌరవ అధ్యక్షులు గా కడివెండి ప్రభాకర్, అసోసియేట్ అధ్యక్షులుగా సోమ సురేష్ , ఉపాధ్యక్షులు గా ఎలబోయిన శ్రీకాంత్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

మలహర్రావు మండలం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా జంగిలి రాజేందర్, మురళీ మనోహర్ రావు, మహా ముత్తారం మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శి లుగా చెరిపల్లి విజయ్ కుమార్, పంజాల అశోక్ లను నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల పరిశీలన అధికారి నల్ల శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తపస్ జిల్లా అధ్యక్షులు ములుకల్ల తిరుపతి, ప్రధాన కార్యదర్శి వెంకట రామిరెడ్డి, సీనియర్ జిల్లా నాయకులు పరమారాధ్యుల సుధాకర్, శ్రీ రవీంద్రనాథ్, వంగ లక్ష్మయ్య తదితరులుపాల్గొన్నారు.