calender_icon.png 3 June, 2025 | 10:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గజేందర్

01-06-2025 06:44:02 PM

నేరడిగొండ (విజయక్రాంతి): ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచేందుకు సీఎం సహాయనిధి ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరు ఈ సీఎం ఫండ్‌ను సద్వినియోగం చేసుకోవాలని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్(Congress party in-charge Gajender) అన్నారు. ఆదివారం నేరడిగొండ క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులు మండాజి ప్రణీత్ రూ. 60 వేలు, ఎల్టీ లావణ్య రూ. 12 వేలు సీఎం సహాయనిధి చెక్కులను ఆదివారం పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు ఆడే వసంత్ రావు, సీనియర్ నాయకులు ఏలేటి రాజశేఖర్ రెడ్డి, రమేష్, కపిల్ జాదవ్, కుంట శంకర్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పోతరెడ్డి పాల్గొన్నారు.