19-06-2025 09:14:11 PM
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జన్మదిన వేడుకలు నిర్వహించిన ఎమ్మెల్యే మదన్మోహన్
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ(Congress party leader Rahul Gandhi) 50వ జన్మదిన వేడుకలు గురువారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్మోహన్(MLA Madan Mohan Rao) మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ యూత్ ఐకాన్ అని, యువతకు ప్రేరణగా నిలిచారని కొనియాడారు. దేశాన్ని ఐక్యంగా ముందుకు తీసుకు వెళ్లే నాయకత్వం ఆయనకు సొంతమని తెలిపారు. ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ ఆయన వ్యక్తిత్వానికి ప్రతిబింబిస్తాయని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.