12 June, 2026 | 2:11 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

ఎల్లారెడ్డి మున్సిపల్ పీఠం కాంగ్రెస్ పార్టీ కైవసం

13-02-2026 01:50 PM

ఎనిమిదో వార్డులో స్వతంత్ర అభ్యర్థి గెలుపు

11వ వార్డులో బిఆర్ఎస్ గెలుపు

ఎల్లారెడ్డి,(విజయ క్రాంతి): మున్సిపాలిటీలోని 12 వార్డులకు గాను 10 వార్డులను కైవసం చేసుకుని ఏకపక్ష విజయాన్ని తమ సొంతం చేసుకుంది.ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 12 స్థానాలకు గాను 10 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయభేరి మోగించి మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండాను నిలబెట్టింది.

ఎల్లారెడ్డి మున్సిపాటిలో గెలిచినా అభ్యర్థుల వీరే

ఒకటో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గాయత్రి తుమ్మల (కాంగ్రెస్) రెండో వార్డు.. మంచిర్యాల మహేశ్వరి (కాంగ్రెస్), మూడో వార్డు కౌసర్ ఉన్నిసా (కాంగ్రెస్ ), నాలుగో వార్డు.. దుంపల మంజుల (కాంగ్రెస్), ఐదవ వార్డు అట్కారి చంద్రయ్య (కాంగ్రెస్), ఆరవ వార్డు.. సయ్యద్ గఫర్ (కాంగ్రెస్), ఏడవ వార్డు.. భాగ్యవతి మాత్తమల (కాంగ్రెస్), ఎనిమిదవ వార్డు.. సిద్ది శ్రీధర్ (స్వతంత్ర అభ్యర్థి), తొమ్మిదవ వార్డు.. గాజే తిరుపతి( కాంగ్రెస్ ), పదో వార్డు.. పద్మ శ్రీకాంత్ (కాంగ్రెస్) ,11వ వార్డు లక్ష్మీ రామగల్ల (బిఆర్ఎస్),12వ వార్డు ఎరుకల దశరథం (కాంగ్రెస్) తదితరులు విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థుల విజయంతో కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలతో ఆనందం వెల్లివిరిసింది.ఈ సందర్బంగా కాంగ్రెస్ కార్యకర్తలు మిఠాయిలు పంచుకొని భారీ టపాసులు పేల్చి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.