calender_icon.png 22 July, 2025 | 10:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విసృత్త స్థాయి ఆత్మీయ సమావేశం

22-07-2025 12:00:00 AM

గద్వాల్ టౌన్ జూలై 21 : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బృందావన్ గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విసృత్త స్థాయి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముందుగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే జన్మదిన వేడుకల సందర్భంగా జడ్పీ మాజీ చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గం ఇంచార్జ్ సరిత ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో కార్యకర్తలతో కలిసి కేక్ కటింగ్ చేసి మల్లికార్జున కర్గేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ నాయకులు మాట్లాడుతూ గద్వాల నడిగడ్డ ప్రాంతంలో అగ్ర కులాలు రాజ్యమేలుతున్నాయని నియోజకవర్గ ఇన్చార్జ్ సరిత బీసీ ఆడపడుచు కావడంతో ఆమెకు ఉన్నత పదవి ఇస్తామని మాటల గారడితో అనగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని కాం గ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆమె చేసిన కృషిని ప్రభుత్వ ప్రతినిధులు మరిచిపోతున్నారని కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలను అణగదొక్కే ప్రయత్నం చేసే వారికి పదవులు ఇచ్చార న్నారు.

బిఆర్‌ఎస్ పార్టీ నుండి ఒకాయన ఎమ్మెల్యేగా గెలిచి ఏ పార్టీ మీది అంటే అభివృద్ది పార్టీ అని చెప్పుకొస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో నిరుపేదల కొరకు ఇందిరమ్మ ఇళ్ళను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటిస్తే ఎమ్మెల్యే ఎవరికి చెప్పితే వారికే ఇందిరమ్మ ఇ ల్లు ఇస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం గ్రామాలలో మండలాలలో పట్టణాలలో  కష్టపడిన కార్యకర్తలకు ఇందిరమ్మ గృహాలు లబ్ధి చేకూరకుండా అగ్రవర్ణ కులాలు అణ గదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గద్వాల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ సరితమ్మ కోసం అసెంబ్లీ సాక్షిగా పార్లమెంటు వరకు వెళ్తామన్నారు.గద్వాల నియోజకవర్గ గ్రామ మండల పట్టణాలలో సరితమ్మ కాంగ్రెస్ తరపున కష్టపడిన వారికి టికెట్లు ఇవ్వాలని అది కాదు అభివృద్ధి కోసం పార్టీ మారిన ఎమ్మెల్యే అనుచరులకు టికెట్లు ఇస్తే సరితమ్మ నిలబెట్టిన వారిని గెలిచేలా అందరం కలిసికట్టుగా కృషి చేయాలని అన్నారు.