22-07-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, జూలై 21(విజయక్రాంతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. సోమవారం హవేలీ ఘన్పూర్ మండలం సర్దన గ్రామం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంబంధిత అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు అందిస్తున్న తీరును కలెక్టర్ ఆరా తీశారు.
ముందుగా సిబ్బంది హాజరు పట్టిక, ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు తదితర విషయాలపై వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖ మెదక్ ఆసుపత్రుల పనితీరును మెరుగుపరిచి ప్రజల విశ్వాసాన్ని చూర గొంటున్నారని చెప్పారు. ముఖ్యంగా ఆరోగ్య కేంద్రం పరిధిలో ప్రసవాల సంఖ్య పెంచేలా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ తనిఖీలో ఆరోగ్య కేంద్రం వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.