17 April, 2026 | 3:19 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

గాంధీభవన్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి

24-06-2025 12:46 PM

హైదరాబాద్: గాంధీభవన్ లో మంగళవారం పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం(Congress Political Affairs Committee meeting ) ప్రారంభం అయింది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ భేటీ కొనసాగుతోంది. పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy), మీనాక్షి నటరాజన్, భట్టి విక్రమార్క పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణం, అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ప్రధానంగా చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.  కేవలం తొమ్మిది రోజుల్లో రైతులకు రైతు భరోసా డబ్బును విజయవంతంగా పంపిణీ చేసినందుకు గుర్తుగా నిర్వహించే వేడుకల్లో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సోమవారం పిలుపునిచ్చారు. గాంధీ భవన్‌లో టీపీసీసీ చీఫ్ బి. మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన వారిని ఉద్దేశించి ప్రసంగించారు.