ఢిల్లీ ట్రీప్పులు కొడుతున్న సీఎంకు రైతుల గోస ఏం తెలుసు : కేటీఆర్
హైదరాబాద్,(విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా కృష్ణా జలాలను తరలిస్తుంటే కాంగ్రెస్ చోద్యం చూస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ఆరోపించారు. ఏపీ ఇప్పటికే కృష్ణా జలాలను 646 టీఎంసీలు వాడుకుందని, సాగర్ కుడి కాలువ(Sagar Right Canal) ద్వారా గత మూడు నెలలుగా రోజుకు 10 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో జలాల తరలిస్తున్నప్పటికీ కాంగ్రెస్ సర్కారు(Congress Government) నిలువరించలేదని కేటీఆర్ వెల్లడించారు. నది జలాలను ఆంధ్రప్రదేశ్ తన్నుకుపోతున్నా బోర్డుకు, రేవంత్ రెడ్డి(Revanth Reddy) సర్కార్ లో చలనం లేదని మండిపడ్డారు.
సాగర్, శ్రీశైలంలో నీళ్లు అడుగంటి పొలాలు ఎండుతున్నాయని, కృష్ణా, గోదావరి నదుల్లో బొట్టును బొట్టును కాపాడుతూ బీడు భూములను కేసీఆర్ సస్యశ్యామలం చేస్తే ఏడాది కాలంలోనే కాంగ్రెస్ పంటపొలాలను ఎండబెట్టిందని కేటీఆర్ విమర్శించారు. తాగునీళ్లు, సాగునీళ్ల గురించి రేవంత్ పట్టించుకోవట్లేదని, నీళ్లు, నిధులు, నియామకాల్లో న్యాయం కోసం ఏర్పడ్డ రాష్ట్రంలోఒక్కొక్కొటిగా అన్నింటిని కాంగ్రెస్ గంగలో కలుపుతుందన్నారు.వచ్చేది వేసవి కాలామని, తాగునీళ్లకు, సాగు నీళ్లకు కష్టం అని తెలిసి కూడా గాలిమోటర్లో ఢిల్లీ ట్రిప్పులు కొడ్తున్న ముఖ్యమంత్రికి అన్నదాతల గోస ఏం తెలుసాని దుయ్యాబట్టారు. కేఆర్ఎంబి పరిధిలోని త్రీ మెన్ కమిటీకి దిక్కులేదని, సాగర్, శ్రీశైలంలో నీళ్లు అడుగంటి పొలాలు ఎండుతున్నా ఈ తెలంగాణ ప్రభుత్వం నీమ్మకు నీరెత్తినట్లుందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.




