29 March, 2026 | 8:48 PM

మేడ్చల్ - షామీర్‌పేట్ ప్రాంతాల్లో మెట్రో కారిడార్‌కు సర్వే పనులు

16-02-2025 05:48 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): హైదరాబాద్‌ మెట్రో సెకండ్‌ ఫేజ్‌లో సరికొత్త టెక్నాలజీ ఆవిష్కరణలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. మేడ్చల్, శామీర్ పేట్ ప్రాంతాల్లో మెట్రో కారిడార్ కు సర్వే పనులు కొనసాగుతున్నాయని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో భూగర్భ కారిడార్‌ నిర్మాణానికి హైదరాబాద్‌ మెట్రో ప్లాన్‌ చేస్తోంది. ఈనెలాఖరుకల్లా ట్రాఫిక్ సర్వే, భూసామర్థ్య పరీక్షలు పూర్తి అవుతాయని తెలిపారు. ప్రతి కిలోమీటరుకు రెండు చోట్ల 15 మీటర్ల వరకు బోర్ వెల్ వేసి మట్టి నమూనాలను సేకరించి విశ్లేషిస్తున్నారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపకల్పన కోసం ట్రాఫిక్ సర్వేలను ఏజెన్సీలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

జేబీఎస్-సికింద్రాబాద్ క్లబ్ రోడ్, పికెట్ కేంద్రియ విద్యాలయం రోడ్, మడ్ ఫోర్డ్ రోడ్, టీవోలీ జంక్షన్ రోడ్, డైమండ్ పాయింట్ కూడలి, సెంటర్ పాయింట్ జంక్షన్, హస్మత్ పేట కూడలి, బోయిన్ పల్లి రోడ్, తాడ్ బండ్ ఎయిర్ పోర్ట్ ఆఫీస్ జంక్షన్, బోయిన్ పల్లి చెక్ పోస్ట్ రోడ్ మీదుగా  శామీర్ పేట వరకు మరో కారిడార్ వెళ్తుంది. మేడ్చల్, శామీర్ పేట్, ప్యూచర్ సిటీ మార్గాల్లో రాబోయే మెట్రో కారిడార్లకు సంబంధించి డీపీఆర్ మార్చి నెలా ఖరుకల్లా సిద్ధం చేసి కేంద్రానికి పంపాలని హెచ్ఎంఆర్ఎల్ కసరత్తు చేస్తోంది.