14-11-2025 01:41:41 PM
హైదరాబాద్: జూబ్లీహిల్స్(Jubilee Hills by-election) ఉపఎన్నికల్లో కాంగ్రెస్(Congress wins) ఘన విజయం సాధించింది. బీఆర్ఎస్ అభ్యర్థి సునీతా గోపినాథ్‌పై(Maganti Sunitha) కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్(Congress candidate Naveen Yadav) 24,658 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ప్రతి రౌండ్ లోనూ నవీన్ యాదవ్ అధిక్యంలో కొనసాగారు. ఏ రౌండ్ లోనూ బీఆర్ఎస్ క ఆధిక్యం దక్కలేదు. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి డిపాజిట్ గల్లంతు కావడంతో కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలుపుతో సీఎం రేవంత్ రెడ్డి ఇమేజ్ పెరిగింది. అధికారంలోకి వచ్చాక.. కాంగ్రెస్ రెండు ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. 2024 జూన్ లో జరిగిన కంటోన్మెంట్ ఉపఎన్నికలోనూ కాంగ్రెస్ గెలిచింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ గల్లంతైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గెలుపులో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి వ్యూహాత్మకంగా వ్యవహరించి బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును భారీ మెజార్టీతో కైవసం చేసుకున్నారు. జూబ్లీహిల్స్ అభ్యర్థిగా అజారుద్దీన్ తట్టుకోలేరని నవీన్ యాదవ్ ను రేవంత్ రెడ్డి ఎంపిక చేశారు. పార్టీల్లో ఆగ్రహం రాకుండా పోలింగ్ కు ముందే మహమ్మద్ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చారు. సీఎం డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రేవంత్ రెడ్డి ప్రచారాన్ని పర్యవేక్షించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ భారీ విజయాన్ని సాధించడం పట్ల ముగ్గురు మంత్రులు, ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు.