14-11-2025 12:29:13 PM
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల్లో(Jubilee Hills Bypoll Results) కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతున్నారు. ఎనిమిదో రౌండ్ లోనూ నవీన్ యాదవ్ 23 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం తొమ్మిదో రౌండ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఆశించిన స్థాయిలో ప్రభావం చూప లేకపోయింది. ఏడు రౌండ్ల తర్వాత కాంగ్రెస్ కు 70,345, బీఆర్ఎస్ కు 50,735, బీజేపీకి 9100 ఓట్లు పడ్డాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ ఆధిక్యంలో కొనసాగుతుండంతో కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.