calender_icon.png 4 October, 2025 | 4:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ కార్యకర్త సస్పెన్షన్

04-10-2025 01:37:59 PM

కాటారం,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కార్యకర్తను సస్పెండ్ చేసినట్లు కాటారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమునూరి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మండలంలోని దామరకుంట గ్రామానికి చెందిన గురెడ్డి శివ సాయి కృష్ణ కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా ఉంటూ, కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించే విధంగా సోషల్ మీడియా గ్రూపులలో పోస్ట్ లు పెడుతూ, పార్టీ అభివృద్ధికి నిరోధకముగా ఉన్నాడని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అనుమతి లేకుండా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల పైన, వారి ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యవహరించినందుకు కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరించినట్లు స్పష్టం చేశారు. పార్టీ నిబంధనలు పాటించాలని,  పాటించని వారు ఎవరైనా, ఎంతటి వారైనా వారి వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు