calender_icon.png 4 October, 2025 | 3:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్నెళ్లలోపు టిమ్స్ ఆసుపత్రి పూర్తి చేయకపోతే.. పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం

04-10-2025 01:01:09 PM

బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఉంటే.. ఈపాటికే టిమ్స్ పూర్తయ్యేది.

ఆర్నెళ్లలోపు టిమ్స్ ఆస్పత్రి నిర్మాణాలు పూర్తి చేయాలి.

నత్తనడకన టిమ్స్ నిర్మాణ పనులు.

హైదరాబాద్: కొత్తపేట టిమ్స్(TIMS Hospital) ఆసుపత్రి నిర్మాణ పనులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావు(Harish Rao), బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. ఆస్పత్రి నిర్మాణ పనుల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ... గతంలో టిమ్స్ ఆస్పత్రి నిర్మాణాన్ని కేసీఆర్ తలపెట్టారని తెలిపారు. టిమ్స్ నిర్మాణ పనులను రేవంత్ రెడ్డి సర్కార్(Revanth Reddy Sarkar) నత్తనడకన చేస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Government) ఉండి ఉంటే.. ఈపాటికే టిమ్స్ పూర్తయ్యేదని హరీశ్ రావు సూచించారు. రాజకీయాలు పక్కనపెట్టి కంటి వెలుగు కార్యక్రమాన్ని కొనసాగించాలని ఆయన ప్రభుత్వాన్నికోరారు. రేవంత్ రెడ్డి సర్కార్ లో ఆరోగ్య శ్రీ ఆస్పత్రులకు బకాయిలు పెట్టారని చెప్పారు. కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) తీసుకొచ్చిన మంచి పనులు ఆపాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారని విమర్శించారు. ఆర్నెళ్లలోపు టిమ్స్ ఆస్పత్రి నిర్మాణాలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఆర్నెళ్లలోపు ఆస్పత్రులు పూర్తి చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.