calender_icon.png 4 October, 2025 | 3:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫేస్‌బుక్‌లో యువతి పరిచయం.. గోల్డ్ ట్రేడింగ్ పేరిట మోసం

04-10-2025 01:54:57 PM

హైదరాబాద్: గోల్డ్ ట్రేడింగ్(Gold Trading) పేరిట సైబర్ నేరగాళ్లు యువతి పేరుతో ఓ వ్యక్తిని బురిడీ కొట్టించారు. హిమాయత్ నగర్ కు చెందిన వ్యక్తి సైబర్ నేరగాళ్ల వలలో పడి డబ్బు పోగొట్టుకున్నాడు. గోల్డ్ ట్రేడింగ్ పేరిట సైబర్ నేరగాళ్లు(Cyber ​​fraud) రూ. 6.32 లక్షలు దండుకున్నారు. సోషల్ మీడియా ప్లాట్ పామ్ అయిన ఫేస్ బుక్ లో అమృతరెడ్డి పేరిట బాధితుడికి యువతి పరిచయమైంది. ఎన్ఎఫ్ఎం క్యాపిటల్ మార్కెటింగ్ ఏజెంట్ నంటూ యువతి వ్యక్తితో పరిచయం పెంచుకుంది. గోల్డ్ ట్రేడిండ్ లో హిమాయత్ నగర్ వ్యక్తితో అమృత రెడ్డి పెట్టుబడులు పెట్టించింది. వ్యక్తి అమృతరెడ్డికి రూ. 6.32 లక్షలు బదిలీ చేశాడు. అనంతరం వ్యాలెట్ లో 38,694 డాలర్ల లాభం ఉన్నట్లు వెబ్ సైట్ చూపించింది.

లాభం విత్ డ్రా చేసుకోవాలంటే రూ. 8 లక్షలు చెల్లించాలని సైబర్ నేరగాళ్లు డిమాండ్ చేశారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎన్ఎఫ్ఎం క్యాపిటల్ మార్కెట్స్ వంటి ఆన్‌లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా అధిక రాబడిని ఇస్తామని హామీ ఇచ్చే ఏజెంట్ల నుండి ఫేస్‌బుక్, వాట్సాప్, ఇతర సోషల్ మీడియా సందేశాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు కోరారు. పెట్టుబడులు, పన్నులు, ఉపసంహరణ రుసుములు, సమ్మతి ఛార్జీల కోసం తెలియని ఖాతాలకు డబ్బును బదిలీ చేయవద్దని పేర్కొన్నారు.

నకిలీ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లు బాధితులను మరింత డబ్బు పంపేలా ఆకర్షించడానికి వాలెట్ బ్యాలెన్స్‌లు, లాభాలను పెంచి చూపవచ్చని పోలీసులు పేర్కొన్నారు. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ చట్టబద్ధత, సెబీ, అధికారిక నియంత్రణ అధికారులతో ధృవీకరించాని పోలీసులు తెలిపారు. ధృవీకరించని ఏజెంట్లు, ప్లాట్‌ఫామ్‌లతో వ్యక్తిగత బ్యాంకింగ్, కేవైసీ వివరాలను చెప్పవద్దని హెచ్చరించారు. అనుమానాస్పద సందేశాలు, కాల్‌లు లేదా వెబ్‌సైట్‌లను వెంటనే మీ బ్యాంక్, స్థానిక సైబర్ క్రైమ్ అధికారులకు తెలియజేయండన్నారు. అటువంటి మోసాలను వెంటనే 1930 హెల్ప్‌లైన్ లేదా www.cybercrime.gov.in కు కాల్ చేయాలని సూచించారు. సైబర్ మోసాలకు సంబంధించిన ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే దయచేసి 8712665171 కు కాల్, వాట్సాప్ సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.