calender_icon.png 19 October, 2025 | 9:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యక్తి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్

19-10-2025 06:05:50 PM

మరిపెడ /దంతాలపల్లి (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం దంతాలపల్లి మండలం దాట్ల శివారులో బైక్ పై వస్తున్న వ్యక్తి అదుపుతప్పి కింద పడిపోవడంతో స్పృహ కోల్పోవడం జరిగింది. అదే దారిలో అటుగా వెళుతున్న కానిస్టేబుల్ వెంటనే స్పందించి తల్లాడ ఉమేష్ ను సిపిఆర్ చేయడంతో స్పృహలోకి వచ్చాడు. క్షతగాత్రుడికి మెరుగైన వైద్య నిమిత్తం ఆంబులెన్స్ లో మహబూబాద్ జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ సంఘటనతో అక్కడున్న ప్రజలు కానిస్టేబుల్ కు అభినందించారు.