21-01-2026 12:00:00 AM
మర్రిగూడ, జనవరి 20 : మండల కేంద్రంలోని క్రీడా మైదానంలో మంగళవారం ప్రధానమంత్రి కేలో మహోత్సవ నియోజకవర్గస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ పోటీలు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రధానమంత్రి కేలో మహోత్సవ రాష్ట్ర కన్వీనర్ గా ఉన్నటువంటి గంగిడి మనోహర్ రెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి సంసద్ కేలో మహోత్సవ క్రీడా ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత యొక్క ప్రతిభను వెలికి తీయడం కోసం యువతకు క్రికెట్ మరియు వాలీబాల, కబడ్డీ, మహిళలకు కోకో పోటీలు వివిధ ప్రాంతాలలో నియోజకవర్గస్థాయిలోలను నిర్వహించి యువతను దేశ అభివృద్ధిలో భాగంగా క్రీడారంగంలో రాణించాలని భారత్ దేశాన్ని ప్రపంచ దేశాలలో క్రీడారంగంలో రాణించాలని ఈ కేలో మహోత్సవ ముఖ్య ఉద్దేశమని అన్నారు.
ఈ నియోజకవర్గ స్థాయి పోటీలలో 30 టీముల పాల్గొన్నాయని నిర్వాహకులు తెలిపారు. ప్రోత్సాహక బహుమతులు మొదటి బహుమతి 50వేల రూపాయలు నగదు, ద్వితీయ బహుమతి 25వేల రూపాయలు నగదు ప్రకటించి యువతను ప్రోత్సహించాలని ఈ కేలో మహోత్సవ యొక్క ముఖ్య ఉద్దేశమని ఓబిసి మోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షులు పిట్టల శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి యాస అమరేందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు పాత్లవత్ రాజేందర్ నాయక్, పందుల రాములు గౌడ్, వేనేపల్లి శ్రీనివాసరావు, గ్యార గోపాల్, చాపల వెంకన్న, ప్రదీప్ రెడ్డి, కీసరవీందర్ రెడ్డి,వెంకటంపేట శేఖర్, నరసింహ చారి, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.